నాలుగు భాషల్లో మలయాళ కుట్టి నిత్యా సినిమా

నాలుగు భాషల్లో మలయాళ కుట్టి నిత్యా సినిమా

Published on Jul 14, 2013 6:00 PM IST

Nithya-Menen
మళయాళ కుట్టి నిత్యా మీనన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితం ఈ మళయాళ కుట్టి హీరోయిన్ శ్రీ ప్రియ డైరెక్ట్ చేసిన ’22 ఫీమేల్ కొట్టాయం’ సినిమా రీమేక్ లో నటించడానికి సైన్ చేసింది. త్వరలో షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. తాజాగా ఈ భామ మరో సినిమాకి సైన్ చేసింది, ఈ సినిమాని సౌత్ ఇండియన్ 4 భాషల్లో షూట్ చేయనున్నారు. కన్నడ డైరెక్టర్ నాగసేఖర్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాని వజ్రేశ్వరి కుమార్ నిర్మించనున్నాడు. నిత్యా మీనన్ – నాగశేఖర్ కాంబినేషన్లో గతంలో ‘మైనా’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. నాలుగు భాషల్లో నిత్యా మీనన్ ముఖ్య పాత్ర పోషించనున్న ఈ సినిమా కోసం నాలుగు భాషల్లో హీరోలను వెతుకుతున్నారు. ఈ సినిమా కన్నా వెర్షన్ కి ‘ఓం ఓమే’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.

తాజా వార్తలు