నితిన్ మరియు యామి గౌతం లు కలిసి నటిస్తున్న చిత్రం “కొరియర్ బాయ్ కళ్యాణ్”. ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫోటాన్ కథాస్ బ్యానర్ మీద గౌతం మీనన్ నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం హైదరాబాద్లోని పలు ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రేమ్ సాయి చెప్తూ సగానికి పైగా చిత్రీకరణ పూర్తయ్యిందని తెలిపారు. నితిన్ మరియు యామిల కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది అని ప్రేమ్ సాయి తెలిపారు. సత్యం రాజేష్ మరియు హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013లో విడుదల కానుంది. ఈ చిత్ర చిత్రీకరణ పూర్తి చేసుకున్న తరువాత నితిన్ “గుండేజారి గల్లంతయ్యిందే ” చిత్రీకరణలో పాల్గొననున్నారు.