కరుణాకరన్ తో జతకట్టనున్న నితిన్

Nithin-and-Karunakaran
నితిన్ ఈ మధ్య చాలా ఆనందంలో వున్నాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా అతని కెరీర్లోనే అత్యంత భారీ విజయం సాధించడమే కాక ఈ ఏడాది బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలబెట్టగలిగాడు. తాజా సమాచారం ఏమిటంటే ఈ హీరో ఇప్పుడు కరుణాకరన్ తో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ చెయ్యనున్నాడు. ” ‘కొరియర్ బాయ్ కళ్యాన్’ తరువాత శ్రేస్ష్ట మూవీస్ బ్యానర్ పై కరుణాకరన్ దర్శకత్వంలో నా తదుపరి సినిమా ఉండబోతుంది. ఈ విషయం ముందుగా మీకే తెలిసిందని” ట్వీటిచ్చాడు. అందమైన ప్రేమకధలును తెరకెక్కించి సినిమాలను విజయపు బాట పట్టించాగల దర్శకుడు కరుణాకరన్. అతను తీసిన ‘తొలిప్రేమ’, ‘డార్లింగ్’ సినిమాలు పెద్ద హిట్లుగా నిలిచాయి. నితిన్ ఇకపై తన క్యారెక్టర్ కు తగ్గ క్యారెక్టర్లే చేస్తాన్నాడు కనుక ఈ దర్శకుడితో కలిసి పనిచెయ్యడం మంచి శకునమే. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తారు. నితిన్ ప్రేమ్ సాయి దర్శకత్వంలో ‘కొరియర్ బాయ్ కళ్యాన్’ లో నటిస్తున్న విషయం తెలిసినదే.

Exit mobile version