‘ఇష్క్’ సినిమాతో హిట్ అందుకొని అదే జోరుతో సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మొదటిది ‘గుండెజారి గల్లంతయ్యిందే’, రెండవది ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. ఈ రెండు సినిమాలలో మొదటగా సమ్మర్లో ‘గుండె జారి గల్లతయ్యిందే’ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా సాంగ్స్ షూటింగ్లో బిజీగా ఉన్న నితిన్ ఈ రోజుటితో ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే పాటల షూటింగ్ పూర్తి చేసాడు.
ఈ పాటలను ఒమన్, అబూ దాబి, దుబాయ్ లో అందమైన లోకేషన్స్ లో షూట్ చేసారు. అలాగే సాంగ్స్ అన్నీ కూడా బాగా వచ్చాయని ఈ చిత్ర టీం ఎంతో సంతోషం గా ఉంది. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాడ్ మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా ఓ స్పెషల్ సాంగ్ చేయడం ప్రత్యేక ఆకర్షణ. విజయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి నిఖిత రెడ్డి నిర్మాత, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.