ఇక మీదట రొమాంటిక్ కామెడీలకే పెద్దపీట అంటున్న బర్త్ డే బాయ్

Nithin1
మొదటి సినిమా ‘జయం’ సినిమాతోనే అఖండ విజయాన్ని అందుకున్న నితిన్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా అతని మనసులో మాటని బయటపెట్టాడు. అతని వయసుకు తగ్గ పాత్రలే చేస్తాడట. వరుస ఫ్లాపుల తరువాత విజయం సాదించిన ‘ఇష్క్’ సినిమా అతని కెరీర్లోనే ఒక మైలురాయి. అతని నూతన సినిమా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ లో నితిన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనపడనున్నాడు. నిత్యామీనన్ మరియు ఇషా తల్వార్ హీరోయిన్స్.

ఈ చిత్రం గురించి నితిన్ మాట్లాడుతూ ” ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఒక ట్రైయాంగ్యులర్ లవ్ స్టోరీ. నిత్యా, నేను కలిసి నటించిన ‘ఇష్క్’ ప్రజాదరణ పొందింది కనుక మరోసారి మా ఇద్దరినీ కలిసి నటించమని కోరారు. సినిమాలో మా ఇద్దరి నడుమ సాగే కెమిస్ట్రీ హైలైట్ గా నిలవనుంది. నా జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు చూసాను. నిజానికి వాటివల్లే నేను ధృడంగా తయారవ్వగాలిగానని” తెలిపాడు.

ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నితిన్ ఆసక్తికరమైన విషయం తెలిపాడు. మంచు విష్ణు తనతో ఒక సినిమా చెయ్యమని కోరాడని, తనకి డేట్లు కుదరక ఒప్పుకోలేకపోయానని తెలిపాడు. “విష్ణు నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి త్వరలోనే నటిస్తాం” అని అన్నాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తరువాత నితిన్ ప్రేమ సాయి తెరకెక్కిస్తున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’లో నటిస్తాడు.

123తెలుగు డాట్ కమ్ ద్వారా నితిన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version