నితిన్ కోసం హీరోయిన్ వేటలో ఉన్న కరుణాకరన్

నితిన్ కోసం హీరోయిన్ వేటలో ఉన్న కరుణాకరన్

Published on Feb 17, 2014 11:45 AM IST

Nithin-and-Karunakaran
యంగ్ హీరో నితిన్ ఇటీవలే ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. త్వరలోనే నితిన్ – కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం కరుణాకరన్ నితిన్ కి జోడీగా నటించబోయే హీరోయిన్ వేటలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఇద్దరు టాప్ హీరోయిన్స్ ని కలిసినా డేట్స్ లేకపోవడంతో వాళ్ళు నో చెప్పారు. దాంతో కరుణాకరన్ కొత్త హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు.

దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే సమయంలో నితిన్ సురేందర్ రెడ్డి అసిస్టెంట్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సినిమా కూడా మొదలవుతుంది. ఈ రెండు సినిమాలను ఒకే సమయంలో చేయడానికి నితిన్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇవి రెండు కాకుండా నితిన్ నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ కూడా సమ్మర్లో రిలీజ్ కానుంది.

తాజా వార్తలు