నితిన్ కెరీర్ లోనే అట్టడుగున వున్న స్థాయినుండి అతనిని మరోసారి టాప్ పొజిషన్ లో నిలబెట్టిన సినిమా ‘ఇష్క్’. ఈ సినిమా 2012లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మళయాళ ప్రేక్షకులను తమ భాషలో అలరించడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాను ‘అయే ప్రియా’ పేరుతొ అనువదించనున్నారు
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించిన నిత్యా మీనన్ ది కేరళ ప్రాంతమే కావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. మళయాళ సంబాషణలను మకొంబు గోపాలకృష్ణ రాస్తున్నారు. దివ్యా ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమాను తీసుకువస్తున్నారు
ఈ సినిమా విడుదలతేదిని త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమాతో నిత్యామీనన్ కు మలయాళంలో విజయం రావాలని కోరుకుందాం