యంగ్ హీరో నితిన్ 2014 సంక్రాంతి కానుకగా ‘హార్ట్ ఎటాక్’ తో జనవరి 31న మనముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. డబ్బింగ్ పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదలకానుంది. ఈరోజు నితిన్ స్టైలిష్ లుక్ ను మన ముందుకు కొన్ని ఫోటోల రూపంలో తీసుకొచ్చారు
నితిన్, ఆదా శర్మ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రధానపాత్రధారులు. ఈ సినిమాలో నితిన్ పోనీ టెయిల్ తో ట్రెండీ లుక్ తో కనిపించాడు. పూరీజగన్ ఈ సినిమాకు దర్శక నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. అమోల్ రథోడ్ సినిమాటోగ్రాఫర్. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటర్. ఈ సినిమాను అధికభాగం స్పెయిన్ లో తెరకెక్కించారు.