మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రం “రాబిన్ హుడ్”. అయితే భీష్మ రేంజ్ లో ఈ చిత్రం విజయం అందుకోలేకపోయింది కానీ డీసెంట్ ఎంటర్టైన్మెంట్ ని మాత్రం అందించింది. మరి థియేటర్స్ నుంచి ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ఈ చిత్రం ఓటిటి హక్కులు జీ5 సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో రాబిన్ హుడ్ నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. అప్పుడు మిస్ అయ్యినవారు ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే ఇందులో చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ కూడా గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.