కొరియర్ బాయ్ గా హట్రిక్ పై కన్నేసిన నితిన్

Nithin1

యంగ్ హీరో నితిన్ తన తాజా చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ తో హట్రిక్ హిట్ అందుకోవాలని టార్గెట్ చేస్తున్నాడు. నితిన్ నటించిన ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఇష్క్’ సినిమా తర్వాత వస్తున్న సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా హిట్ అవుతుందని నితిన్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా స్టొరీ లైన్ చాలా కొత్తగా ఉంటుందని నితిన్ తెలిపాడు.

యామి గౌతం హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ప్రేమ్ సాయి డైరెక్టర్. నితిన్ తన సినిమాల్లో హై కామెడీ, రొమాన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ కూడా అలానే ఉండే అవకాశం ఉందని అందరూ ఆశిస్తున్నారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. పేరున్న డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

Exit mobile version