1980 – 1990 మధ్య కాలంలో మంచి పాపులారిటి ఉన్న నటి నిరోష. గతంలో ఆమె నటించిన ‘ఘర్షణ’, ‘నారి నారి నడుమమురారి’, ‘స్టువర్టుపురం పోలీసు స్టేషన్’లాంటి సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ను సాదించాయి. ఆమె పెళ్లి చేసుకున్న అనంతరం నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం ఆమె మళ్ళి తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్దమైయ్యింది. ఆమె ఒక కామెడీ తమిళ సినిమాలో గెస్ట్ పాత్రలో నటిస్తోంది. ఆమె తనకు, తన వయసుకు సరిపోయే పాత్రల్లో నటించే అవకాశం కోసం చూస్తోంది. ఆమె త్వరలో తెలుగు సినిమాలలో కూడా నటించే అవకాశం వుంది.