రవితేజ-దీక్ష సేథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నిప్పు’ సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైవిఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. మిరపకాయ చిత్రం తరువాత దీక్షా సేథ్ మరోసారి రవితేజ సరసన నటిస్తుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే టర్కీలో పాటలు చిత్రీకరణ జరుపుకున్న నిప్పు చిత్రం జనవరి 13న విడుదల కాబోతుంది.