‘స్వయంభూ’ టీజర్‌పై నిఖిల్ సాలిడ్ అప్డేట్.. బ్లాస్ట్ ఖాయమట!


యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘స్వయంభూ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి, ఆదిత్య బాహుదానం సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. హిస్టారికల్ ఎపిక్ మూవీగా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.

ఈ సినిమాలో నిఖిల్ తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ చిత్ర టీజర్ గురించి నిఖిల్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.

అభిమానులు ‘స్వయంభూ’ మూవీ టీజర్ కోసం ఆసక్తిగా చూస్తున్నారని.. త్వరలోనే ఈ టీజర్ అప్డేట్ ఉంటుందని.. ఇది బ్లాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తుందని ఆయన కాన్ఫిడెంట్‌గా తెలిపాడు. దీంతో ఈ చిత్ర టీజర్ పై అప్పుడే బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Exit mobile version