టాలీవుడ్ డాషింగ్ హీరో మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఇంకా అనేకమంది స్టార్ నటీనటుల సమాహారంతో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం “కన్నప్ప” కోసం అందరికీ తెలిసిందే. అయితే కన్నప్ప సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించినప్పటికీ ఈ సినిమా ఓటిటి డీల్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు.
మామూలుగా ఈ తరహా భారీ చిత్రాలకి డెఫినెట్ గా ముందే ఓటిటి డీల్స్ జరిగిపోతాయి కానీ ఈ సినిమాకి మాత్రం తామే హోల్డ్ లో పెట్టినట్టుగా ఇంట్రెస్టింగ్ డీటెయిల్ విష్ణు రివీల్ చేసాడు. ఓటిటి ఆఫర్స్ వచ్చాయి కానీ తాము అడిగిన రేట్ కి రాలేదని తెలిపాడు. అయితే సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే మాత్రం తాను అడిగిన రేట్ ఇస్తారని చెప్పగా ఆ మొత్తం రెడీ చేసుకోమని చెప్పినట్టు విష్ణు తెలిపాడు. దీనితో తన సినిమా పట్ల తాను ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.