ఇంజనీరింగ్ విధ్యార్ధులతో ఘర్షణకు నిఖిల్ జవాబు ఏంటి??

Nikhil
‘స్వామి రా రా’ సినిమాతో విజయం చవిచూసిన నిఖిల్ హైదరాబాద్లో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర పెనగులాట ద్వారా ఒక విచిత్రమైన సంఘటనను ఎదుర్కున్నాడు. నిఖిల్ తమ్ముడు చదువుతున్న ఆ కాలేజీలో తోటి విద్యార్ధులతో గొడవ అయ్యింది. అప్పుడు ఆ కాలేజీకు వెళ్లిన నిఖిల్ అక్కడి విధ్యార్ధులతో పెనుగులాటకు గురయ్యాడు. కాకపోతే తనకు ఈ సంఘటనకు ఎలాంటి సంబంధం లేదని నిఖిల్ తెలియజేసాడు. కాలేజీనుండి తిరిగి రాగానే ట్విట్టర్లో తాను రాగింగ్ ఆపడానికి ప్రయత్నించండి అని ట్వీట్ చేసాడు.

ఇదే స్టొరీను నిఖిల్ మాటల్లో వింటే “నా తమ్ముడ్ని వాళ్ళ సీనియర్స్ రాగింగ్ చేస్తే కాలేజీ యాజమాన్యం మరియు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నేను వాడిని తీసుకురావడానికి వెళ్ళానంతే. అంతే ఫ్రెండ్స్… రాగింగ్ చట్టరిత్యా నేరం. నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ రాగింగ్ కు పాల్పడ్డ సంఘటనలు లేవు. ఈరోజు నా తమ్ముడికి జరిగింది, రేపు వేరొకరి జరగచ్చు. కాబట్టి ఈ రాగింగ్ ను అరికట్టడానికి మీడియా సహాయం చెయ్యవలసిందిగా “కోరాడు. ఈ సంఘటన యొక్క పరిణామాలు మరికొన్ని రోజులలో కొత్త వార్తలను తీసుకోస్తుందేమో చూడాలి.

Exit mobile version