మెగా డాటర్ పెళ్ళికి ఎప్పుడు, ఎక్కడ.. వివరాలివే

మెగా డాటర్ పెళ్ళికి ఎప్పుడు, ఎక్కడ.. వివరాలివే

Published on Nov 5, 2020 12:09 AM IST


నటిగా సినీ రంగప్రవేశం చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక. ‘ఒక మనసు, సూర్యకాంతం’ చిత్రాల్లో కథానాయకిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. నటిగా కొనసాగుతూనే పెళ్లి పీఠాలు ఎక్కడానికి సిద్ధమైంది నిహారిక. గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌ రావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం జరగనుంది. ఇటీవలే నిశ్చితార్థ వేడుక కూడ జరిగింది. పెళ్లి డేట్ దగ్గరపడుతుండటంతో వేడుకకు సన్నాహాలు ప్రారంభించారు.

డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వీరిద్దరూ ఒక్కటవ్వనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌లో వివాహం ఘనంగా జరగనుంది. డిసెంబర్‌ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. నిహారిక సోదరుడు, హీరో వరుణ్ తేజ్ దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చైతన్య తల్లిదండ్రులు వివాహ పత్రికను తిరుమలలోని శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ వివాహ వేడుకకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీ సభ్యులంతా హాజరుకానున్నారు.

తాజా వార్తలు