పవన్ కి ‘రాజా సాబ్’ బ్యూటీ స్పెషల్ థాంక్స్.. ఎందుకంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రెండు సినిమాలు ఈ ఏడాదిలో వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిగా హరిహర వీరమల్లు సినిమా వస్తే అందులో తన సరసన యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటించింది. ఇక ఈ సినిమా తర్వాత తన నుంచి వచ్చిన చిత్రమే “ఓజి”. మరి ఆ సినిమా వచ్చి నెలల తర్వాత ఓజి వచ్చేసింది. కానీ ఇప్పుడు పవన్ కి నిధి అగర్వాల్ స్పెషల్ థాంక్స్ చెప్తుంది.

మరి ఇదెందుకు అంటే రీసెంట్ గా జరిగిన ఓజి సక్సెస్ మీట్ లో పవన్ మరోసారి నిధి అగర్వాల్ కోసం మాట్లాడ్డం జరిగింది. వీరమల్లు సినిమా విషయంలో ఆమె ఒక్కర్తే ప్రమోషన్స్ చేయడంతో తాను బయటకి వచ్చి ప్రమోషన్స్ చేసానని అలానే ఓజి కి కూడా వచ్చానని తెలిపారు. ఇలా మళ్ళీ ఓజి ఈవెంట్ లో ప్రస్తావించడంతో నిధి అగర్వాల్ చాలా ఆనందం వ్యక్తం చేసింది. తన కోసం ఓజి సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారి మాటలు తనని ఎంతగానో హత్తుకున్నాయి అని ఆనందం వ్యక్తం చేస్తూ థాంక్స్ చెప్పింది. దీనితో రాజా సాబ్ బ్యూటీ రిప్లై మంచి వైరల్ గా మారింది.

Exit mobile version