18 నుండి కొత్త జంట కొత్త షెడ్యూల్

kotha-janta
అల్లు శిరీష్ మరియు రెజీనా జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటెర్టైనర్ ‘కొత్త జంట’ అనే టైటిల్ తో నిర్మాణమవుతుంది. శరవేగంగా సాగుతున్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 18నుండి కొత్త షెడ్యూల్ మొదలుకానుంది

ఈ సినిమా కామెడీని మేళవించిన ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతుంది. మారుతి ఈసారి ఎటువంటి బూతు అంశాలు లేకుండా సినిమాను తీస్తున్నాడు. అల్లు శిరీష్ ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ వస్తుందని నమ్మకంగా వున్నాడు.

ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాణమవుతుంది. ఎస్.కె.ఎన్ సహకార నిర్మాత

Exit mobile version