రామ్ చరణ్ బాలీవుడ్లో నటిస్తున్న మొదటి సినిమా ‘జంజీర్’ సినిమా ప్రోమో వీడియోలు ఈ నెలాఖరున మన ముందుకురానున్నాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘తుఫాన్’. అపూర్వ లిఖియ ఈ సినిమా దర్శకుడు. ” ‘జంజీర్’ సినిమా ప్రోమోలు ఈ నెలాఖరున మన ముందుకు రానున్నాయి. జూలై నుండి పూర్తిగా పబ్లిసిటి మీద దృష్టిపెట్టనున్నామని” దర్శకుడు ట్వీట్ చేసాడు. దర్శకుడు యోగి తెలుగు వెర్షన్ ను పర్యవేక్షిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా కనిపిస్తుంది. తెలుగులో సంజయ్ పాత్రను శ్రీ హరి పోషిస్తున్నాడు. ఆయిల్ మాఫియా నేపధ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.