మాస్ సినిమాలపై ఆసక్తి చూపుతున్న యంగ్ హీరో

Varun
‘హ్యాపీ డేస్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో వరుణ్ సందేశ్. తను నటించిన సినిమా ‘సరదాగా అమ్మాయితో’ ఈ నెల 14న విడుదలకానుంది. వరుణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ నేను ఈ సినిమాలో చాలా అల్లరి చిల్లరగా అమ్మాయిల వెనకాల తిరుగుతూ వుంటాను. అలాంటి నాలో మార్పు వస్తుంది. అది ఎలా వస్తుంది అనేదే సినిమా కథ అని అన్నాడు.

అలాగే తన గురించి మాట్లాడుతూ ‘నేను ఎక్కడా నటన నేర్చుకోలేదు. సినిమా రంగం నా చేత నటనలో ఓనమాలు దిద్దించి నన్నుఇంతటివాన్ని చేసింది. నేను మొదటి సినిమా చేస్తున్నపుడు శేఖర్ కమ్ముల గారు నాతో ఒక విషయం చెప్పారు. ఎప్పుడు కూడా నటించడానికి ప్రయత్నం చేయకూడదు. పాత్రల్లా ప్రవర్తించాలి. అలా ఆయన చెప్పిన దానినే ఇప్పటి వరకు నేను ఫాలో అవుతున్నాను. ఆయనతో మరోసారి కలిసి నటించాలని వుంది’ అన్నాడు. అంతేకాదు తనకి మాస్ సినిమా చేయాలని వుందని కానీ అందరు నాదగ్గరకి ప్రేమ కథలతోనే వస్తున్నారని కూడా అన్నాడు.

‘సరదాగా అమ్మాయితో’ సినిమాకి భాను శంకర్ దర్శకత్వం వహించగా కుమారస్వామి నిర్మించాడు. ఈ సినిమాలో ‘ఏమైంది ఈ వేళ’ సినిమాలో తనతో కలిసి నటించిన నిషా అగర్వాల్తో మరో సారి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ఛార్మి కనిపించనుంది.

Exit mobile version