తరుణ్ ఆఖరి యుద్ధం

tarun
‘చుక్కలాంటి అబ్బాయి.. చక్కనైన అమ్మాయి’ సినిమాతో చాలారోజుల తరువాత తరుణ్ తెరపై కనిపించినా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలయింది. తరుణ్ ని అందరూ దాదాపు మర్చిపోయారు కాబట్టి ఆ సినిమా విడుదలైన విషయం కూడా చాలా మందికి తెలియలేదు. ఆఖరికి విమలారామన్ అందాలు ఆరబోసినా అవి కూడా సినిమా విజయానికి దోహదపడలేదు. అయినా తరుణ్ తన దండయాత్రను కొనసాగిస్తున్నాడు. ‘యుద్ధం’ అనే సినిమాతో మరోసారి మనముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో తరుణ్, శ్రీ హరి ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాతో తానూ చేస్తున్న ఆఖరి ప్రయత్నానికి విజయం అందాలని కోరుకుందాం.

Exit mobile version