సన్నబడాలంటే ఒళ్ళు హూనమయ్యేలా ఎక్సర్సైజులు చెయ్యకర్లేదు,నోటిని అదుపులో పెట్టుకుని డైటింగ్ లు అవి కుడా చెయ్యనవసరం లేదు, కేవలం డాన్సు చేస్తూ మనల్నిమనం మర్చిపోతూ హాయిగా సన్నబడే మార్గం ఒకటుంది. ఆ డాన్స్ పేరే ‘జుంబా’. ఇది ఒక ఆఫ్రికన్ డాన్స్. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ఈ డాన్స్ కు ఈ మధ్య పట్టణాలలో క్లాసులు కుడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ను ప్రచారం చెయ్యడానికి సినీరంగానికి చెందిన అక్క చెలెల్లు నడుం కదిపారు. ముంబైలో గోల్డ్ జిమ్ లో కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ ‘సంపంగి’, ‘అరుంధతి’ ఫేం అర్జున్ భాజ్వా తో కలిసి జుంబా డాన్స్ చేసారు. అమ్మాయిలూ చుడండి మరి ఆ డాన్స్ సంగతేంటో …