‘గౌరవం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా మరో మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్. రాధ మోహన్ తీసిన ఈ ప్రయత్నాన్ని అయితే అందరూ మెచ్చుకున్నారు గానీ ఈ సినిమా అతనికి గానీ, శిరీష్ కు గానీ పెద్దగా ఒపయోగాపడలేదు. ఇప్పుడు శిరీష్ రెండో సినిమా మారుతి దర్శకత్వంలో ‘కొత్త జంట’గా ఖరారు అయిందట.
ఈ సినిమా ముందు చిత్రంలా ప్రయోగాత్మకంగా కాకుండా కడుపుబ్బా నవ్వించే సినిమాగా తెరకెక్కించాలని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెజీనా కధానాయికగా నటించనుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించగా ‘100%లవ్’ నిర్మాత బన్నీ వాస్ నిర్మించనున్నాడు.