ఎవరికైనా తనకంటే తన కొడుకు మంచి స్థానంలో వండాలని కోరుకుంటారు. పుత్రోత్సాహం అన్న పదానికి సరైన అర్ధం అదే.. ఇప్పుడు మన టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కుడా ఆ ఆనందంలోనే వున్నాడు. అదేంటి రాజమౌళికి కొడుకెక్కడున్నాడు అనుకోకండి.. ఇండస్ట్రీ వారికి తప్ప పెద్దగా ఎవరికీ తెలియని విషయం ఇది . జక్కన్న కొడుకు కార్తికేయ బాలీవుడ్లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ దగ్గర శిష్యరికం చేస్తున్న కార్తికేయ అనురాగ్ తీసిన ‘అగ్లీ’ సినిమా కేన్స్ లో ప్రదర్శితం అవుతుండడంతో అక్కడకు వెళ్తున్నాడని రాజమౌళి ట్వీట్ చేసాడు. సో త్వరలో మనకు మరో జక్కన్న దొరకనున్నాడన్నమాట.