అక్క కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో నటించి టాలీవుడ్ లో అగ్ర తారలలో ఒకరుగా నిలిచింది. కానీ చెల్లెలు నిషా అగర్వాల్ ప్రొఫెషన్ లో అక్క లెవెల్ కు వెళ్ళకుండానే ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. అవును ‘ఏమైంది ఈ వేళ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా నిషా అగర్వాల్ ప్రస్తుతం ప్రేమలోవుందట. “నేను ప్రేమలో వున్నాను. కాకపోతే అతనికీ ఈ ఇండస్ట్రీకి సంబంధం లేదు. సమయం వచ్చినప్పుడు నేనే అతని పేరును స్వయంగా వెల్లడిస్తాను” అని తెలిపింది. మొన్న సమంత- సిద్ధార్ద్, నిన్న హన్సిక – శింబు, మరి నేడు నిషా ప్రేమిస్తున్న ఆ ప్రేమికుడు ఎవడో ??