నందమూరి వంశం నుండి ఇండస్ట్రీకి పరిచయమైన హీరో తారకరత్న హిట్స్ లేక గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. యాక్షన్, లవ్, సోషియో ఫాంటసీ, భక్తిరస చిత్రాలు అని తేడా లేకుండా అన్ని సినిమాలు చేసేస్తున్నాడు. అలా తారకరత్న భక్తుడిగా చేసిన ప్రయత్నమే ‘మహా భక్త సిరియాళ’. ఈ సినిమా ఆడియో కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్ర్రమంలో తారకరత్న మాట్లాడుతూ ‘ డైరెక్టర్ నాకు ఈ కథ చెప్పినప్పుడు అసలు నేను ఈ పాత్ర చేయగలనా? లేదా? అనే ఆలోచించుకొని ఆ తర్వాత ఓకే చేసాను. ప్రస్తుతం అందరూ లవ్, కమర్షియల్ సినిమాలు చేస్తుంటే మా నిర్మాత మాత్రం ఇలాంటి ఓ భక్తి చిత్రం తీయడం ఎంతో అభినందించదగ్గ విషయమని’ అన్నాడు. అర్చన హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకి రాంబాబు దర్శకత్వం వహిస్తుండగా, వల్లభనేని వెంకటేశ్వరరావు నిర్మించారు.