భారతదేశంలోని సంగీతాభిమానులకు, సినిమా అభిమానులకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం సంగీతమే కాకుకుండా ప్రైవేట్ ఆల్బమ్స్, స్టేజ్ షోలు చేసే రెహమాన్ త్వరలోనే ‘రెహమాన్ ఇష్క్’ అనే పేరుతో ఓ సంగీత యాత్రని మొదలు పెడుతున్నారు. ప్రలల్లో శాంతి, ప్రేమ భావనల్ని నింపాలనే ఉద్దేశంతో రెహమాన్ ఈ యాత్రని చేపట్టాడు. అక్టోబర్ 1 నుంచి మొదలు కానున్న ఈ యాత్ర కోసం దేశంలోని నాలుగు ప్రముఖ పట్టణాలను ఎంచుకున్నాడు. మొదటగా అక్టోబర్ 1న కోల్ కతాలో ఈ యాత్ర మొదలవుతుంది, ఆ తర్వాత అక్టోబర్ 12న విశాఖపట్నంలో, అక్టోబర్ 20న జైపూర్ లో, అక్టోబర్ 27న అహ్మదాబాద్ లో ఈ యాత్ర జరగనుంది.
2010 లో ‘ది జర్నీ హోం వరల్డ్ టూర్’ అని ఓ యాత్రను చేపట్టి 16 దేశాల్లో పర్యటించిన రెహమాన్ భారతదేశంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న మొట్టమొదటి టూర్ ఇదే.. అలాగే రెహమాన్ తన అభిమానుల కోసం ‘రెహమాన్ అంటే నీకెంత ఇష్టం?’ అనే పోటీని పెట్టి దానిలో గెలుపొందిన వారికి విఐపి పాస్ లను అందిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీరు కూడా అందులో పాల్గొని పాస్ లను గెలుగుకోండి.