అక్కినేని వంశం నుండి ఇండస్ట్రీకి పరిచయమైన సుశాంత్ దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత చేసిన సినిమా ‘అడ్డా’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. సినిమా మంచి విజయం అందుకున్న కారణంగా ఈ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.
సక్సెస్ మీట్ లో ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన చింతలపూడి శ్రీనివాస్ ఈ సినిమా చెయ్యడానికి స్ఫూర్తి నిచ్చింది ఎ.ఎన్.ఆర్ గారే అని అన్నాడు. ‘ ఒకరోజు ఆయన్ని కలవడానికి వెళితే ఆయన ఓ పెళ్ళికి వెతున్నారు. ఆయన ఈ మధ్య పెళ్లిళ్లకు వెళ్లి ఆశీర్వదించాలంటే భయంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెళ్ళైన కొత్త జంటలన్నీ విడిపోతున్న సందర్భాలే ఎక్కువగా చూస్తున్నాం అందుకే కాస్త భయం అని ఆయన అన్నారు. అది జరిగిన 5 నెలలకి కార్తీక్ రెడ్డి అలాంటి కాన్సెప్ట్ నాకు చెప్పాడు. అప్పుడు ఎ.ఎన్.ఆర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి వాటిని స్పూర్తిగా తీసుకొని ఈ సినిమా చేసామని’ ఆయన అన్నాడు.
ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్న హీరో సుశాంత్, హీరోయిన్ శాన్వి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, నిర్మాత నాగసుశీల తదితరులు సినిమాని పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు తమ ధన్యవాదాలు తెలియజేశారు.