ఘట్టమనేని వారసుడి సినిమా కథ అదేనా ?

‘ఆర్ఎక్స్ 100’, మంగళవారం చిత్రాలతో ప్రేక్షకులను ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి ప్రాజెక్ట్ ను లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక అప్ డేట్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఐతే, ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. తిరుపతి నేపథ్యంలో హిందూ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది.

విష్ణువు స్వయంభుగా అవతరించిన ఈ క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథా నేపథ్యం సాగుతుందని.. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. మొత్తానికి సినిమాలో ఎమోషనల్ డ్రామా కూడా చాలా బాగుంటుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో సీనియర్ కథానాయిక రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఆమె కూడా ఈ సినిమాతోనే తెలుగులోకి అరంగేట్రం చేయబోతుంది. చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు,

Exit mobile version