రజినీకాంత్ ‘కూలీ’ టైటిల్ మారిందిగా.. కొత్త టైటిల్ ఏమిటో తెలుసా?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు హిందీలో ‘కూలీ’ టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే హిందీలో ‘కూలీ’ అనే టైటిల్ రిజిస్టర్ అయి ఉండటంతో అక్కడ ఈ సినిమాను ‘మజ్దూర్’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తారనే వార్త సినీ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో జోరుగా వినిపించింది. కాగా, ఇప్పుడు ఈ సినిమాకు హిందీలో ‘కూలీ – ది పవర్‌హౌస్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను కూడా వారు రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version