పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు మారుతి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
కాగా ప్రభాస్ సినీ రంగ ప్రవేశం చేసిన 23 ఏళ్ల సందర్భంగా ‘రాజాసాబ్’ మేకర్స్ ఓ సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు. దర్శకుడు మారుతి ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ప్రభాస్ స్టైలిష్ లుక్‌తో సిగరెట్ తాగుతూ కనిపించాడు. “23 ఏళ్ల క్రితం ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఈరోజు అదే రోజున ‘ది రాజా సాబ్’ షూట్‌ను ముగించారు. ఆయన విజయయాత్రలో భాగమవడం నాకు గర్వంగా ఉంది. ది రాజా సాబ్ పూర్తిగా కొత్త ఎనర్జీతో ఉండబోతోంది.” అంటూ మారుతి కామెంట్ చేశారు.
ఇక ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జీ.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
