మంచి పొటెన్షియల్ ఉన్న మహేష్ సినిమాకి కొత్త సినిమాల ఎఫెక్ట్!?

మంచి పొటెన్షియల్ ఉన్న మహేష్ సినిమాకి కొత్త సినిమాల ఎఫెక్ట్!?

Published on Jul 11, 2025 1:09 AM IST

మన టాలీవుడ్ స్టార్ హీరోస్ లో కొంచెం యునిక్ ఫిల్మోగ్రఫీ ఉన్న హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. తన కెరీర్ మొదలు నుంచి కూడా ఎన్నో వినూత్న ప్రయోగాలు, సాహసాలు చేసిన సూపర్ స్టార్ తెలుగు ఆడియెన్స్ కి తన అభిమానులకి ఎంతో గుర్తుండిపోయే సినిమాలు అందించారు.

ఈ సినిమాల్లో ఒక అవైటెడ్ రీరిలీజ్ అని చెప్పొచ్చు అదే “అతడు”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మహేష్ చేసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు కూడా ఉన్నాయి. ఒక కల్ట్ క్లాసిక్ గా నిల్చిన ఈ సినిమా ఎట్టకేలకి రీమాస్టర్ అయ్యి రీరిలీజ్ కి ఫిక్స్ అయ్యింది. నిజానికి మహేష్ బాబు కెరీర్ లోనే రీరిలీజ్ లో ఎక్కువ వసూళ్లు అందుకోగల గట్టి పొటెన్షియల్ ఉన్న సినిమా ఇదే అని చెప్పడంలో సందేహం లేదు.

అయితే ఈసారి మహేష్ బర్త్ డే కానుకగా ఆగస్ట్ 9న డేట్ ఫిక్స్ అయ్యింది కానీ దీనికి కొత్త సినిమాల సెగ తప్పేలా లేదు. ఓపెనింగ్స్ వరకు బాగానే ఉంటాయి కానీ మరికొన్ని రోజులు థియేటర్స్ లో రన్ అవ్వగలిగే సత్తా ఈ సినిమాకి సొంతం కానీ దీనికి ముందు కింగ్డమ్, ఇది వచ్చే వారంలోనే వార్ 2, కూలీ లాంటి భారీ సినిమాలు ఉన్నాయి. వీటితో అతడు వసూళ్లకు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది తప్పనిసరి పరిస్థితి. ఈ పోటీలో కూడా అతడు ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు