నాలుగు పెద్ద సినిమాల విదేశీ రైట్స్ సొంతం చేసుకున్న కొత్త వ్యక్తి

నాలుగు పెద్ద సినిమాల విదేశీ రైట్స్ సొంతం చేసుకున్న కొత్త వ్యక్తి

Published on Apr 24, 2013 4:35 PM IST

Pawan,-Ram-Charan-and-NTR
విదేశాలలో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల మార్కెట్ పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం నిర్మాతలకి సినిమాల విదేశీ రైట్స్ మేజర్ వ్యాపారంగా మారింది. తెలుగు స్టార్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ సినిమాలకి విదేశాలలో కోట్ల రూపాయలు బిసినెస్ జరుగుతోంది. ఈ ఫీల్డ్ కి కొత్త గా వచ్చిన నవీన్ అనే ఎన్.ఆర్.ఐ కొంతమంది ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ని కలిసి విదేశీ డిస్ట్రిబ్యూటిగ్ హక్కులను కొనుక్కున్నాడు. ఈయన నాలుగు పెద్ద ప్రాజెక్ట్ లను కొనుక్కున్నాడని తెలిసింది. ఆ సినిమా వివరాలు మీ కోసం..

1. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమా
2. ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ ల ‘రామయ్యా వస్తావయ్య’
3. రామ్ చరణ్ – వంశీ పైడిపల్లి ల ‘ఎవడు’
4. ఎన్.టి.ఆర్ – కందిరీగ శ్రీనివాస్ సినిమా

పైన తెలియజేసిన అన్ని ప్రాజెక్ట్ లకి సంబందించిన బిజినెస్ ముదిసింది. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమాకి రూ. 6. 50 -7 కోట్ల వ్యాపారం జరిగిందని సమాచారం.

తాజా వార్తలు