“వకీల్ సాబ్” పై ఇప్పుడు డౌట్లు ఏంటి.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రం ఊహించని విధంగా ఆగిపోవడంతో సరికొత డేట్ కోసం ఇప్పుడు పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా మరోపక్క ఈ గ్యాప్ లో ఈ సినిమాకు సంబంధించి కొంత బజ్ కూడా వినిపిస్తుంది. వచ్చే సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ రానుంది అని గట్టి బజ్ వినిపించింది.

అలాగే అదే రోజున మరో పోస్టర్ కూడా విడుదల కానుంది అని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ సరికొత్త డౌట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆరోజున టీజర్ వచ్చే అవకాశాలు తక్కువే అని మరో వెర్షన్ వినిపిస్తుంది. ఇప్పటికే నిరాశలో ఉన్న పవన్ అభిమానులకు దిల్ రాజు ఏమన్నా తీపి కబురు అందజేస్తారో లేదో చూడాలి.

Exit mobile version