ఎన్టీఆర్ ‘వార్ 2’ తెలుగు వెర్షన్ పై లేటెస్ట్ అప్ డేట్ !

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. కాగా వచ్చే వారం నుంచి ఈ సినిమా తెలుగు వెర్షన్ కి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పానున్నాడని తెలుస్తోంది. అన్నట్టు సినిమాలో ఎన్టీఆర్ పై ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పూర్తిగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడని, ముఖ్యంగా సినిమాలో తారక్ లైవ్ లుక్ కి – ఫ్లాష్ బ్యాక్ లుక్ కి చాలా వేరియేషన్ ఉంటుందని తెలుస్తోంది.

కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.

Exit mobile version