చిన్న సినిమా తీసి మెప్పించాలంటే ఎంతో మేధస్సు అవసరం : రాజమౌళి


చిన్న సినిమా తీయాలంటే ఎంతో మేధస్సు కావాలంటున్నారు అగ్ర దర్శకుడు రాజమౌళి. ఎందుకంటే చిన్న సినిమాలో స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ లాంటివి ఉండవు. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ లాంటివి లేకుండా కేవలం కథను మాత్రమే నమ్ముకుని ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పించాలంటే చాలా కష్టం అని ఆయన అంటున్నారు. ‘ఈగ’ ఆలోచనకి ఎప్పుడు పునాది అని అడగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ మర్యాద రామన్న తరువాత ప్రభాస్ తో ఒక సినిమా చేయాల్సి ఉండగా తను వేరే సినిమాతో బిజీగా ఉన్నాడు. నాలుగు నెలల గ్యాప్ ఉండడంతో ఆ సమయంలో ఒక సినిమా చేయాలనుకున్నాను. చిన్న ఈగ కాస్త పెద్దదిగా మారింది అన్నారు. ఈ నెల 6న విడుదలవుతున్న ఈగ పై తనకు పూర్తి నమ్మకముందని రాజమౌళి అంటున్నారు. సుదీప్, నాని, సమంతా ముఖ్య పాత్రల్లో నటించిన ఈగ చిత్రానికి ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

Exit mobile version