పవన్ వెనక్కి తగ్గడంతో ముందుకొస్తున్న హీరోలు

పవన్ వెనక్కి తగ్గడంతో ముందుకొస్తున్న హీరోలు

Published on Mar 19, 2020 10:08 AM IST

పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’ చివరి దశ పనుల్లో ఉంది. మొదట ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. ఆ ప్రకారమే షూటింగ్ శరవేగంగా చేశారు. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ ఆగడంతో విడుదలను కూడా వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్. ఈ పరిణామం వేరే సినిమాలకు బాగా కలిసొచ్చేలా ఉంది.

ఇనాళ్లు పవన్ సినిమా బరిలో ఉండటంతో మే నెలలో కాకుండా జూన్ నెలలో వస్తే బాగుంటుందేమో అనుకున్న హీరోలంతా ఇప్పుడు ముందుకొస్తున్నారు. మే నెల మధ్యలోనో లేకపోతే మే నెలాఖరులోనో ప్రేక్షకుల ముందుకురావాలని అనుకుంటున్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు మే నెలలో దగ్గర దగ్గర ఆరు లేదా ఏడు సినిమాలు విడుదలయ్యేలా ఉన్నాయి. మొత్తం మీద పవన్ సినిమా వెనక్కి వెళుతుండటం కొందరు హీరోలకు బాగానే కలిసొచ్చింది.

తాజా వార్తలు