బాలయ్య బాబు – బి.గోపాల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటుందట. కాగా ఈ ప్రాజెక్ట్ జూన్ 10న బాలయ్య పుట్టినరోజున నాడు అధికారికంగా ప్రారంభమవ్వబొతుందని తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘బాలయ్య గోపాల్’లది సూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలు బి గోపాల్ డైరెక్ట్ చేసినవే. ఇక ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా చేత ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ రాయిస్తున్నారు.
మరి చూడాలి ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ సక్సెస్ అవుతుందో లేదో. ఇక బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్యకు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో బోయపాటి ఈ సినిమా చేస్తున్నాడు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.