శ్రీ రామరాజ్యం వేడుకలో భావోద్వేగానికి గురైన ఏఎన్నార్, బాలకృష్ణ

శ్రీ రామరాజ్యం వేడుకలో భావోద్వేగానికి గురైన ఏఎన్నార్, బాలకృష్ణ

Published on Feb 26, 2012 12:52 PM IST


నందమూరి బాలకృష్ణ రాముడిగా నయనతార సీతగా బాపు చిత్రీకరించిన అధ్బుత దృశ్యకావ్యం ‘శ్రీ రామరాజ్యం’. ఈ చిత్రం ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న హైదరాబాదులో వేడుక ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు అక్కినేని నాగేశ్వరరావు, బాపు, మురళీ మోహన్, బాలకృష్ణ హాజరయ్యారు. నయనతార హాజరు కావాల్సి ఉండగా పలు కారణాల వాళ్ళ హాజరు కాలేకపోయారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ నేను వాల్మీకి పాత్ర పోషిస్తాను అంటే వద్దు అంది. నేను నాగార్జున కలిసి సర్ది చెప్పాం. కాని రామాయణానికి అసలైన హీరో వాల్మీకి. అందుకే ఈ పాత్ర పోషించమని అడిగినపుడు వెంటనే ఒప్పుకున్నాను. బాలకృష్ణ మాట్లాడుతూ మా నాన్న గారితో పోటీ పడుతున్నట్లు అనిపించింది. ఇలాంటి పాత్రలు పోషించడం నా అద్రుష్టం. ఈ వేడుకలో అందరు భావోద్వేగానికి గురయ్యారు.

తాజా వార్తలు