కొన్నాళ్ళు విరామం తరువాత గత సంవత్సరం నుండి తిరిగి నటిస్తున్ననయనతార రెండు విషయాలపై మాత్రం చాలా శ్రద్ధ చూపిస్తుంది. అవి తన సినిమాలు, తన స్నేహితులు. తన తోటి నటుడు ఆర్యతో ఈ భామ చెలిమి అంటూ గత కొన్ని నెలలుగా చాలానే వార్తలు వచ్చాయి. ఇప్పుడు నయన్ కు తాప్సీ రూపంలో మరో ఫ్యాన్ మరియు స్నేహితురాలు దొరికింది. వీరిద్దరూ కలిసి విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అజిత్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కులూ-మనాలిలో చిత్రీకరణ జరుపుకుంటుంది కనుక పనిలో పనిగా వాళ్ళ పని మధ్యలో కొండల నడుమ బైక్ రైడ్స్ కు వెళ్తున్నారట. ఈ సినిమాలో తాప్సీ ఒక పత్రికా విలేఖరి పాత్ర పోషిస్తుంది.
ఇదిలావుంటే ఇప్పటికే నయన్ డేట్స్ కోసం నిర్మాతలు వరుసకట్టి మరీ నుంచుంటే ఈ అమ్మడు మాత్రం ఆమెకు నచ్చిన పాత్రలైతేనే ఒప్పుకుంటుందట. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అనామిక’ లో తన భర్తను వెతుక్కునే గృహిణి పాత్రలో కనిపించనుంది. అంతేకాక ఆర్య సరసన ‘రాజ రాణి’ సినిమాలో కుడా నటిస్తుంది.