నయన్ ఆ సినిమా చెయ్యట్లేదు..కొట్టి పారేసిన ఆమె టీం.!

నయన్ ఆ సినిమా చెయ్యట్లేదు..కొట్టి పారేసిన ఆమె టీం.!

Published on Dec 30, 2020 12:00 PM IST

మన దక్షిణాదిలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్స్ లో క్వీన్ నయనతార కూడా ఒకరు. తెలుగు మరియు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నయన్ ఇప్పుడు పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది. అయితే ఇటీవలే నయన్ ఒక పీరియాడిక్ డ్రామా చేస్తుంది అని పలు కథనాలు విపరీతంగా ప్రచారం జరిగాయి.

మరి అసలు విషయంలోకి వెళ్తే తమిళ నాటకు చెందిన వీరనారి రాణీ వేలు నచియార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే భారీ పీరియాడిక్ చిత్రంలో నటించేందుకు నయన్ ఒప్పుకున్నట్టుగా పలు మీడియా వర్గాలు ప్రచారం చేసాయి. మరి దీనిపై వివరణ ఇస్తూ ఆమె పీఆర్ టీం వాటిని కొట్టి పారేసారు.

ఇందులో తమకు నిరాధార వార్తలు చెవిన పడ్డాయి అని అసలు అసలు కన్ఫర్మేషన్ లేకుండా ఆలాంటి వార్తలను ఎలా పబ్లిష్ చేస్తారని ఆ వార్తలను ప్రచారం చేసిన వారికి స్ట్రాంగ్ గానే ఇచ్చారు. అంతే కాకుండా ఖచ్చితంగా సమాచారం ఉంటే తప్ప చెయ్యొద్దని సూచించారు. నయన్ నటించిన లేటెస్ట్ చిత్రం “అమ్మోరు తల్లి” హాట్ స్టార్ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. అలాగే నయన్ ఇప్పుడు ఓ రజినీతో “అన్నాత్తే”లో కూడా నటిస్తుంది.

తాజా వార్తలు