యువ నటుడు నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన “అనగనగా ఒక రాజు” రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా 2026 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. మొదట ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా, తర్వాత బాధ్యతలు మారికి మారాయి.
తాజాగా నవీన్ పొలిశెట్టి స్వయంగా ఒక డాన్స్ నంబర్‌కు గాత్రం అందించారు. ఆ పాటను నవంబర్ మూడో వారంలో విడుదల చేయనున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి సమయంలో చిరంజీవి, ప్రభాస్, రవితేజ చిత్రాలతో పోటీగా విడుదల కానుంది.
