తమిళంలో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న నవీన్ చంద్ర


హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అందాల రాక్షసి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర. ప్రస్తుతం నవీన్ చంద్ర వరుసగా తమిళంలో సినిమాలు ఒప్పుకుంటూ బిజీ అవుతున్నారు. తను హీరోగా తమిళంలో పరిచయం కానున్న ‘తెరోడం వీడియిలే’ అనే సినిమా కోసం సిద్దమవుతున్నాడు. రౌడీ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ‘ప్రయాణం’ ఫేం పాయల్ ఘోష్ కథానాయికగా నటించనుంది. సరో శ్రీరాం దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఎక్కువ భాగం ఈ రోడ్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రం కాకుండా ‘అందాల రాక్షసి’ చిత్రం విడుదల కాగానే ‘సివప్పు’ అనే చిత్రాన్ని అంగీకరించారు. సత్య శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రూప మంజరి కథానాయికగా నటించనుంది. ఈ రెండు చిత్రాలు కాకుండా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దళం’ అనే ఒక ద్విభాషా చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నవీన్ చంద్ర గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో పియా బాజ్పాయ్ కథానాయికగా నటిస్తోంది.

Exit mobile version