ప్రారంభమైన నవదీప్ ‘వసూల్ రాజ’

ప్రారంభమైన నవదీప్ ‘వసూల్ రాజ’

Published on Aug 22, 2012 7:15 PM IST


నవదీప్ హీరోగా తెరకెక్కనున్న ‘వసూల్ రాజ’ చిత్రం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో లాంచనంగా ప్రారంభమైంది. గతంలో ‘సాధ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తికేయ గోపాలకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లరి నరేష్ నటించిన ‘ఆహ నా పెళ్ళంట’ చిత్రంలో నటించిన రితు బర్మేచ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి చిన్ని చరణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్ర కార్యక్రమానికి లా మరియు కోర్ట్స్ స్టేట్ మినిస్టర్ ఏరసు ప్రతాప్ రెడ్డి, లక్ష్మీ మంచు, మంచు మనోజ్, క్రిష్ మరియు తాప్సీ అతిదులుగా హాజరయ్యారు. నవదీప్ మరియు శ్రీహరి పై తీసిన ముహూర్తపు సన్నివేశానికి ఏరసు ప్రతాప్ రెడ్డి క్లాప్ నివ్వగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

‘ లవ్ స్టొరీ కలగలిసిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం ‘వసూల్ రాజ’ ఈ రోజు ప్రారంభమైంది. ఈ చిత్రంలో రితు బర్మేచ మరియు శ్రీహరి నాతో పాటు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిన్ని చరణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారని’ నవదీప్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నవదీప్ ఈ చిత్రంలో కాకుండా శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ‘పొగ’ అనే హర్రర్ ఫిల్మ్, రాజ్ పిప్పాల దర్శకత్వంలో ‘బంగారు కోడి పెట్ట’ మరియు ‘మైత్రి’ సినిమాల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు