నవదీప్ ఈ రోజుల్లో చాలా బిజీగా ఉంటున్నాడు. అతని చేతిలో ఇప్పటికే రెండు సినిమాలు ఉన్నాయి. అవేకాకుండా ‘బాద్ షా’ లో నెగిటీవ్ రోల్ చేసాడు. ఇప్పుడు మనోడు హైదరాబాద్లో మరో సినిమాని లాంఛనంగా ప్రారంబించాడు. నవదీప్ మరియు కావ్య శెట్టి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి టైటిల్ ని ఇంకా ఖరారు చెయ్యలేదు. జ్వాలా గుత్తా క్లాప్ నివ్వగా, నిర్మాత నాగేశ్వర రావు కెమెరా స్విచ్ ఆన్ చేసాడు. కొప్పుల రమేష్ బాబు ఈ సినిమాకి నిర్మాత. డి శ్రీనివాస రావు సమర్పకుడు. ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ దర్శకుడు.
ఈ సినిమా గురించి నవదీప్ మాట్లాడుతూ .”ఈ సినిమాకి సరైన పేరు పెట్టడానికి చాలా ఆలోచిస్తున్నాం. ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ఒక మంచి కధతో వచ్చాడు. నాకు తెలిసి ఈ కధను వేరే ఏ హీరో చెయ్యడానికి అంగీకరించాడు. స్క్రిప్ట్ విన్నప్పుడు నేను చేయగలనా లేదా అని సందేహించాను. కాని ఈ స్క్రిప్ట్ ని వదలడం నాకిష్టం లేదు. సౌత్ ఇండియన్ సినిమాలోనే ఇది ఒక కొత్తరకం కాన్సెప్ట్ అని ” చెప్పాడు. జూన్ నేలాఖరకు ఈ సినిమా షూటింగ్ ముగించుకుని జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. జియా ఖాన్ మరియు ఆశిష్ గాంధి ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. చిన్నా సంగీతం సమకూర్చాడు. వాసు సినిమాటోగ్రాఫర్.