ఈరోజుల్లో బాగా బిజీగా వుంటున్న నవదీప్ చేతుల్లో ప్రస్తుతం దాదాపు ఆరు సినిమాలు వివిధ దశలలో వున్నాయి. నవదీప్ ఆఖరిగా ‘బాద్ షా’ సినిమాలో గుర్తుండిపోయే పాత్రలో నటించాడు
ప్రస్తుతం నవదీప్ చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్న సినిమాకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించాడు. చక్రవర్తి హీరో సిద్ధార్ధ్ కు దగ్గర సన్నిహితుడు. ఈయన బ్యాడ్ మంకీస్ బ్యానర్ పై సినిమాను తీశాడు. ఈ సినిమా యొక్క నిర్మాణంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బృందం తెలపడానికి నిరాకరిస్తుంది
‘సై’, ‘అనుకోకుండా ఒక రోజు’ వంటి సినిమాలలో నటించిన శశాంక్ ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ద్విభాషా చిత్రాన్ని వెంకట కాచర్ల దర్శకుడు. ఈ సినిమా ద్వారా ఇద్దరు నాయికలు పరిచయంకానున్నారు