బ్యాంకాక్లో బాద్షా టీంతో చేరనున్న నవదీప్

బ్యాంకాక్లో బాద్షా టీంతో చేరనున్న నవదీప్

Published on Aug 30, 2012 7:15 PM IST


సెప్టెంబర్ 1 నుండి నవదీప్ “బాద్షా” చిత్రీకరణలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ చిత్రంలో విలన్ పాత్రలో నవదీప్ కనపడనున్నాడని గతంలోనే మేము చెప్పాము. ప్రస్తుతం ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం నవదీప్ బ్యాంకాక్ వెళుతున్నారు. ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 25 వరకు బ్యాంకాక్లో జరుగుతుంది. ఈ నెలలోనే మొదలయిన “వసూల్ రాజ” చిత్రీకరణలో గత కొద్ది రోజులుగా నవదీప్ పాల్గొంటున్నారు. ఆ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరువాత నవదీప్ బాద్షా చిత్రీకరణలో పాల్గొంటారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు కాజల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపి మోహన్ మరియు కోన వెంకట్ స్క్రిప్ట్ అందించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేసుకోబోతున్న ఈ చిత్రం 2013 జనవరి 11న విడుదల కానుంది.

తాజా వార్తలు