సుస్మితా సేన్ తో కలిసి పనిచేయనున్న నవదీప్


కొత్త టీవీ యాంకర్స్ కోసం యంగ్ హీరో నవదీప్ మరియు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కలిసి ఒక టాలెంట్ హంట్ ప్రోగ్రాం చేయనున్నారు. ఇది ఇప్పటి వరకూ జరగని విధంగా ఫీమేల్ బ్యూటీ ప్రెగ్నెంట్ కోసం ఈ హంట్ నిర్వహిస్తున్నారు. ‘ మాజీ మిస్ యూనివర్స్ అయిన సుస్మితా సేన్ గారి ‘ఐ యాం షి’ అనే కంపెనీతో కలిసి నవదీప్ మరియు రాజశేఖర్ మేనేజర్స్ అయిన రా ప్రొడక్షన్ కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ‘ఐ యాం షి’ నిర్వహిస్తున్న ఆర్.పి.హెచ్ ఈవెంట్ ఫైనల్స్ ఈ సంవత్సరం హైదరాబాద్లో జరగనుంది. మన నాలుగు సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి సౌత్ ఇండియన్ టీవీ కోసం మొట్ట మొదటి సారిగా ఫీమేల్ బ్యూటీ ప్రెగ్నెంట్ ని ఎంపిక చేయనున్నాం. ఆర్.పి.హెచ్ ప్రతి సౌత్ ఇండియన్ సిటీల్లో కాంపిటీషన్ జరిపి ప్రతి సిటీ నుంచి 10 మందిని సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన వారందరినీ ఒక వేరే దేశానికి తీసుకెళ్ళి వారికి కొన్ని పోటీలు నిర్వహిస్తారు. అలా ఒక్కొక్క సిటీ నుంచి వచ్చిన వారిలో నుంచి ఇద్దరినీ సెలెక్ట్ చేసి వారికి ఫైనల్స్ ఇండియాలో నిర్వహిస్తాము. ఇందులో గెలిచిన వారికి 2013 ‘ఐ యాం షి’ ఫైనల్స్ కి డైరెక్ట్ ఎంట్రీ దొరుకుతుందని’ నవదీప్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

మన హైదరాబాద్లో ఈ నెల 21న ఈ కాంపిటీషన్ జరగనుంది. దీని పూర్తి వివరాలు ‘ఐ యాం షి’ అధినేత సుస్మితా సేన్ గారు త్వరలోనే తెలియజేస్తారు. ఇందులో గెలిచిన విన్నర్ మిస్ యూనివర్స్ బ్యూటీ ప్రెగ్నెంట్ కాంపిటీషన్ కి ఇండియా తరపున నామినేట్ చేయబడతారు.

Exit mobile version