ఎన్టీఆర్ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్న నవదీప్

ఎన్టీఆర్ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్న నవదీప్

Published on Aug 24, 2012 11:09 AM IST


శ్రీను వైట్ల డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘బాద్షా’ సినిమా ప్రస్తుతం ఫైట్ సన్నివేశాల చిత్రీకరణలో ఉండగా ఈ సినిమాకి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. జై సినిమా ద్వారా హీరోగా పరిచయమైన నవదీప్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని నవదీప్ స్వయంగా ధ్రువీకరించాడు. నవదీప్ గతంలో ఆర్య 2, ఓ మై ఫ్రెండ్ సినిమాలో కీలక పాత్రలు పోషించాడు. ఈ సినిమా నవదీప్ కెరీర్ కి హెల్ప్ అవుతుందేమో వేచి చూడాలి. నవదీప్ ప్రస్తుతం మైత్రి, బంగారు కోడిపెట్ట, వసూల్ రాజా, దిల్ కుష్ మరియు పొగ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు