అంత సీన్ లేదు అంటున్న నవదీప్ మరియు శశాంక్

Antha-Seen-Ledu
నవదీప్ మరియు శశాంక్ కలిసి నటిస్తున్న సినిమా ‘అంత సీన్ లేదు’. ఈ సినిమా టైటిల్ లోగోను మొదటి లుక్ ను ఈరోజే విడుదల చేసారు

ఈ సినిమా ఇప్పటికే ప్రధాన పాత్రల డబ్బింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో పల్గుంటుంది. ఈ సినిమా ఒక కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సిద్ధార్ధ్ ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన చక్రవర్తి రామచంద్ర ఈ సినిమాని బ్యాడ్ మంకీ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు

ఈ సినిమా విడుదల త్వరలోనే ప్రకటిస్తారు. ఈ చిత్రంలో ఇద్దరు కొత్త హీరోయిన్లు పరిచయం కానున్నారు. వెంకట్ కాచర్ల తొలిసారిగా దర్శకత్వం వహించనున్నాడు

Exit mobile version